రాజన్న సిరిసిల్ల, వెలుగు: కొద్దిపాటి వానకే సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంతం జలమమైంది. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన ముసురు వానకు సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాంతంలో నీరు భారీగా రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. డ్రైన్ లలోని మురుగంతా రోడ్డుపైకి రావడంతో దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
