హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో శనివారం ఎప్ సెట్ మాక్ అలాట్మెంట్ జరగనుంది. ఇప్పటి వరకు 88 వేల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, వారు ఎంచుకున్న ప్రాధాన్యతలు, ర్యాంకుల ఆధారంగా ఈ ట్రయల్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
మాక్ అలాట్మెంట్‌లో సీటు రాని విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు, కొత్తవి ఎంచుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించనున్నారు. ఎడిటింగ్ ముగిశాకే తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది.
