సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదు..పాకిస్తాన్కు స్పష్టం చేసిన భారత్

సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదు..పాకిస్తాన్కు స్పష్టం చేసిన భారత్

న్యూఢిల్లీ: టెర్రరిజానికి పాకిస్తాన్ మద్దతిస్తున్నంత కాలం సింధు జలాల ఒప్పందం (ఇండస్ వాటర్స్ ట్రీటీ-)పై వెనక్కి తగ్గేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ బెదిరింపులు, ప్రచారం వల్ల భారత్‌‌ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది. 2025లో జరిగిన పహల్గామ్‌‌ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందం అమల్లో లేకుండా (అబేయన్స్‌‌లో) చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగుతున్నందునే ఒప్పందాన్ని నిలిపివేశాం. పాకిస్తాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా ఉగ్రవాదానికి మద్దతు విరమించుకోవాలి’ అని స్పష్టం చేశారు.