తమిళ హీరో అథర్వ మురళి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇదయం మురళి’. జులై 10న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’గా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
అథర్వ మురళితో పాటు ఫహాద్ ఫాజిల్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎయిర్‌పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో స్టైలిష్‌గా నడుస్తూ కనిపిస్తున్నారు. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్స్‌గా నటించారు.
నటరాజన్ సుబ్రహ్మణ్యం, నిహారికా ఎన్‌ఎం ఇతర కీలక పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ప్రమెషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.గీతం అందిస్తున్నాడు.
