శంషాబాద్, వెలుగు : శంషాబాద్ పరిధి కొత్వాల్ గూడ ఈకో పార్క్ సమీపంలో రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత ముర్తుజా పహిల్వాన్దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. తన స్థలంలో ముర్తుజా పహిల్వాన్మరో ముగ్గురితో కలిసి కూర్చుని ఉండగా సుమారు 8 నుంచి 10 మంది దుండగుల ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు.
తీవ్రంగా గాయపడిన అతడిని అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు, భూవివాదాలు లేదా పాత కక్షలు కారణమై ఉంటాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
