హైదరాబాద్ బడుల్లో మిడ్డెమీల్స్ తింటలేరు!..సగం మంది ఇంటి నుంచే లంచ్ బాక్సులు

హైదరాబాద్  బడుల్లో మిడ్డెమీల్స్ తింటలేరు!..సగం మంది ఇంటి నుంచే లంచ్ బాక్సులు
  •     హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సగం మంది ఇంటి నుంచే లంచ్ బాక్సులు
  •     మిడ్డెమీల్స్ చేస్తున్నది సగటున 48.36 శాతమే.. 
  •     పొద్దునే 9, 10 గంటలకే ఫౌండేషన్ల నుంచి వస్తున్న ఫుడ్
  •     మధ్యాహ్నానికి పాడైపోవడం లేదా చల్లారిపోతున్న వైనం

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలోని బడుల్లోని విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడానికి ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సర్కారు స్కూళ్లలో సగం మందికి పైగా విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. బడుల్లో మధ్యాహ్న భోజనం తింటున్నది సగటున కేవలం 48.36 శాతమే ఉంది.  రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలవగా, చివరి 5 స్థానాల్లో మూడు గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాలే ఉన్నాయి. మరోవైపు గ్రామీణ జిల్లాలు కాస్త మెరుగైన పనితీరు కనబరచగా.. 82 శాతానికి పైగా హాజరుతో సిద్దిపేట, ఖమ్మం జిల్లాలు రాష్ట్రంలోనే టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 18,65,338 మంది విద్యార్థులు సర్కారు స్కూళ్లలో చదువుతున్నారు. వారందరికీ మిడ్డెమీల్స్ అందిస్తున్నారు. సగటున సుమారు 13.65 లక్షల మంది (73%) మాత్రమే భోజనం చేస్తున్నారు. మిగిలిన 5 లక్షల మంది (27.10%) స్కూల్​కు రాకపోవడం లేదా భోజనానికి దూరంగా ఉంటున్నారు.

సిటీలో చల్లారిన ఫుడ్డే..

జిల్లాల్లోని బడుల్లోనూ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లలోనూ మధ్యాహ్న భోజన అమలు తీరులో ఉన్న తేడాయే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. గ్రామీణ జిల్లాల్లో వంట ఏజెన్సీల ద్వారా బడుల్లోనే భోజనం తయారు చేసి, విద్యార్థులకు వేడిగా అందిస్తున్నారు. దీంతో అక్కడి స్టూడెంట్లు బడి భోజనాన్ని ఎక్కువగా తింటున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చాలా స్కూళ్లలో ఫౌండేషన్ల ద్వారా భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. ఎక్కడో వండిన ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాక్సుల్లో పెట్టి వాహనాల్లో స్కూళ్లకు తీసుకొస్తున్నారు. అన్ని స్కూళ్లకు అందించే క్రమంలో చాలా బడులకు ఉదయం 9 నుంచి 11 గంటలకే మధ్యాహ్న భోజనం చేరుతోంది. తీరా మధ్యాహ్నం విద్యార్థులు తినే సమయానికి ఆ భోజనం పూర్తిగా చల్లారిపోతోంది. 

ఇంటి నుంచే బాక్సులు, కూరలు.. 

ఫౌండేషన్ల నుంచి వచ్చే భోజనం చల్లగా ఉండడంతో పాటు రుచిగా లేకపోవడంతో చాలా మంది స్టూడెంట్లు ఇంటి నుంచే లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. మరికొందరు విద్యార్థులు బడిలో పెట్టే అన్నంతో తినేందుకు ఇంటి నుంచి కూరలు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బడుల్లో అన్నంతో పాటు పప్పు లేదా బిర్యానీ, దాల్చా, అన్నం మరో కూర మాత్రమే ఇస్తున్నారు. జనరల్​గా అన్నం, ఒక కర్రీ మాత్రమే వస్తున్నాయి. వీటికి తోడు అదనంగా ఇంకో కర్రీ ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు తినే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఫౌండేషన్ల ద్వారా కాకుండా, జిల్లాల్లో మాదిరిగా వంట ఏజెన్సీల ద్వారా బడుల్లోనే వండిపెడితే వేడిగా తింటారని, హాజరు మరింత పెరుగుతుందని పేరెంట్స్, టీచర్లు చెప్తున్నారు.

గ్రేటర్, పరిసర జిల్లాల్లో దారుణ పరిస్థితి

రాష్ట్రంలో అత్యధిక విద్యార్థుల సంఖ్య ఉన్న గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లోనే మధ్యాహ్న భోజనం తినేవారి సంఖ్య దారుణంగా పడిపోయింది. రాష్ట్రంలోనే అట్టడుగున నిలిచిన హైదరాబాద్ జిల్లాలో మొత్తం 1,09,886 మంది విద్యార్థులు నమోదై ఉండగా, నవంబర్ రెండో వారంలో వరుసగా మూడు రోజుల సగటు ప్రకారం కేవలం 53,142 మంది (48.36%) మాత్రమే భోజనం చేశారు. అంటే దాదాపు 56,744 మంది మిడ్డెమీల్స్ కు దూరంగా ఉంటున్నారు. చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 87,756 మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సగటున 64.88 శాతమే (56,938 మంది) తింటుండగా, దాదాపు 30,818 మంది దూరంగా ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 1,38,576 మంది విద్యార్థులు ఉన్న రంగారెడ్డి జిల్లా చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడ సగటున 69.05 శాతమే (95,684 మంది) భోజనం చేయగా, దాదాపు 42,892 మంది బడి భోజనం తినడం లేదు. 

సిద్దిపేట, ఖమ్మం టాప్

నగరంలోని బడులకు భిన్నంగా గ్రామీణ జిల్లాల్లో విద్యార్థులు మిడ్డెమీల్స్ కు మంచి ఆదరణ చూపుతున్నారు. దీనికి మానిటరింగ్ కూడా ఓ కారణంగా ఉంది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు నిత్యం బడుల్లో పర్యవేక్షణ చేయడంతో వంటలు రుచికరంగా చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలోనే 82.49 శాతంతో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. ఆ జిల్లాలో 75,861 మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మూడు రోజులూ 62 వేలకు పైగా భోజనం చేస్తున్నారు. ఇక 82.17 శాతంతో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వీటి తర్వాత మెదక్ (79.06%), రాజన్న సిరిసిల్ల (78.75%), జనగామ (78.71%), నారాయణపేట (78.26%), కామారెడ్డి (78.15%), వికారాబాద్ (77.81%), మహబూబాబాద్ (77.70%), నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ (77.68%), వనపర్తి (77.20%) జిల్లాలు 80 శాతం మార్కుకు దగ్గరగా నిలిచాయి.