- విద్య, ఉద్యోగాల్లో జరుగుతున్న నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలి
- వేం నరేందర్ రెడ్డిని కోరిన మాల సంఘాల జేఏసీ
ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాల, మాల అనుబంధ కులాల వారికి రోస్టర్ విధానం వల్ల విద్యా, ఉద్యోగాల్లో జరుగుతున్న నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని గ్రేటర్ హైద్రాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ కోరారు. సోమవారం హైదరాబాద్ లోని వేం నరేందర్ రెడ్డి నివాసంలో వర్గీకరణ వల్ల జరుగుతున్న నష్టాన్ని గణాంకాలతో సహా వివరించి మాల సంఘాల జేఏసీ వినతిపత్రం అందజేసింది.
రోస్టర్ విధానం వల్ల మాల, మాల అనుబంధ కులాలకు జరుగుతున్న నష్టాన్ని మంత్రులతో కలిసి అనేక సార్లు సీఎం దృష్టికి తీసుకు పోయామని..ఈసారి మంత్రులతో పాటు మాల సంఘాల జేఏసీ ప్రతినిధులను కూడా తీసుకెళ్లి సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
