నీతి కథ: రవీంధ్రభారతిలో నృత్య పంచతంత్రం..మొసలి.. గుంపు పావురాల కథ..

నీతి కథ: రవీంధ్రభారతిలో నృత్య పంచతంత్రం..మొసలి.. గుంపు పావురాల కథ..

కోతిని మోసం చేసి గుండెకాయను తినాలనుకుని దెబ్బతిన్న మొసలి కథ, ఐకమత్యమే మహాబలమని చెప్పిన గుంపు పావురాల కథ, తనను తినాలనుకున్న సింహాన్ని బావిలో దూకేలా చేసిన కుందేలు కథ, కాలం విలువ గురించి చెప్పే మూడు చేపల కథ..ఈ పంచతంత్ర కథలను ఎప్పటికీ మర్చిపోలేం..మళ్లీ మనందరికీ వాటిని గుర్తు చేయడానికి శంకరానంద కళాక్షేత్రం వినూత్నంగా డ్యాన్స్​ రూపంలో ప్రయత్నం చేసింది. ప్రముఖ డ్యాన్సర్​, పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ కొరియోగ్రఫీ, దర్శకత్వంలో హైదరాబాద్, బెంగళూరుకు చెందిన 20 మంది ఆర్టిస్టులు భరతనాట్య శైలిలో హావభావాలతో ఆవిష్కరించి ఔరా అనిపించారు.