స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం..

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. మంగళవారం ( ఆగస్టు 18 ) సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సహా సుమారు 55కు పైగా ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది క్యాబినెట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలు,పరిశ్రమలు వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్.

గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, పట్టాన ప్రాంతాల్లో బీసీలకు 33.1 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది క్యాబినెట్. ఎన్నికల హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచే అంశంపై ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో క్యాబినెట్ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. 

స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ లోగా నిర్వహించాలని నిర్ణయించింది క్యాబినెట్. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు రూ.16 వేల 500 కోట్ల నిధులు నష్టపోకుండా ఉండేందుకు ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ క్యాబినెట్.

ALSO READ : ప్రధాని మోదీ దృష్టిలో భగత్ సింగ్, అంబేద్కర్ దిమాగీ నక్సల్స్ నా?

ఈ క్రమంలో క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత. బీసీలకు రాజకీయ సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని... బీసీల రిజర్వేషన్లలో టీడీపీదే చారిత్రాత్మక పాత్ర అని అన్నారు మంత్రి సవిత.