స్వాతంత్ర్య దినోవ్సవ వేడుకల సందర్భంగా దిమాగీ నక్సల్స్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. మోదీ వ్యాఖ్యలపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తను దిమాగీ నక్సల్ అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. తను నిజమైన దేశభక్తుడినని.. బీజేపీకి భయపడేవాడిని కాదని అన్నారు.
80 స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. దేశంలో ఆయుధాలు పట్టి అడవుల్లో ఉండే నక్సల్స్ ను అంతం చేశామని.. దిమాగీ నక్సల్స్ హింసను ప్రేరేపించేందుకు ఎదురు చూస్తున్నారని.. సమాజాన్ని తప్పుడు దోవ పట్టించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
మోదీ వ్యాఖ్యలపై వీడియో మెసేజ్ ద్వారా స్పందించి కేజ్రీవాల్.. మోదీ ప్రకారం
ధైర్యంగా ప్రశ్నించే వారు దిమాగీ నక్సల్స్.. ఎవరైతే బీజేపీకి భయపడకుండా ప్రశ్నిస్తారో వాళ్లంతా మోదీ దృష్టిలో దిమాగీ నక్సల్స్. ఒకవేళ భగత్ సింగ్ , అంబేద్కరర్ ఇప్పటికీ బతికే ఉంటే.. వాళ్లను కూడా ప్రధాని మోదీ.. దిమాగీ నక్సల్స్ అనేవారేమోనని మండిపడ్డారు.
జవాబుదారీ వ్యవస్థ, అవినీతి లేని సమాజం, ప్రజలకు సౌకర్యాలు, ఆస్పిటల్స్ స్కూల్స్, , డ్రైనేజీ సిస్టమ్ మొదలైన వాటిపై ప్రశ్నించే వారు మోదీ దృష్టిలో దిమాగీ నక్సల్సేనా అని ప్రశ్నించారు. నేను నిజమైన దేశ భక్తుడిని అందుకే నేను దిమాగీ నక్సల్.. అంటూ చెప్పుకొచ్చారు.
हाँ। मैं दिमाग़ी नक्सल हूँ। क्योंकि मैं देशभक्त हूँ। और मुझे इस पर गर्व है। pic.twitter.com/ADE3YRfvSJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2026
