ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ ‘మరకతమణి 2’. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలియజేశారు. 2017లో విడుదలైన ‘మరకతమణి’ తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో అదే ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న ‘మరకతమణి 2’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఏఆర్‌కే శరవణ్‌నే సీక్వెల్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు.
ఆది పినిశెట్టితో పాటు సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, నిక్కీ గల్రాణి, మునీష్‌కాంత్, ఆనంద్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుధన్ సుందరం, మనీష్ సింగాల్, దుర్గారామ్ చౌదరి, దేవ్, కేవీ దురై కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధీబు నినన్ థామస్ సంగీతం అందిస్తున్నాడు. రాజేష్ కన్నన్ డైలాగ్స్ రచయితగా, పీసీ స్టంట్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఆడియో, ట్రైలర్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
