ధనుష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓం చాప్టర్ 1 ’. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వండర్‌బార్ ఫిలింస్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.
వాస్తవానికి అక్టోబర్ 16న విడుదల కావాల్సిన ఈ సినిమాను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ‘ది డే ఫర్ ది అల్టిమేట్ స్ట్రైక్ ఈజ్ హియర్’ అంటూ పవర్‌ఫుల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
