కండక్టర్‌‌గా సీఎం విజయ్‌‌..ప్రయాణికులకు స్వయంగా టికెట్లు ఇచ్చిన దళపతి

కండక్టర్‌‌గా సీఎం విజయ్‌‌..ప్రయాణికులకు స్వయంగా టికెట్లు ఇచ్చిన దళపతి
  • తమిళనాడులో ‘వెట్టి పయనం తిట్టం’ విస్తరణ షురూ

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శుక్రవారం ‘వెట్రీ పయనం తిట్టం’ (ఫ్రీ బస్ స్కీం) పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీం కింద ఏసీ బస్సులు మినహా మిగతా అన్నింట్లో మహిళలు, ట్రాన్స్‌‌జెండర్లు, దివ్యాంగులు చార్జీల్లేకుండా ప్రయాణించవచ్చు. గాంధీ జయంతి సందర్భంగా చెన్నైలోని కోయంబేడు బస్టాండ్‌‌లో ముందుగా సీఎం విజయ్ మహాత్ముడికి నివాళులు అర్పించారు. 

అనంతరం బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించారు. ఆతర్వాత ఆయన కండక్టర్ అవతారం ఎత్తారు. మెషీన్ చేతబట్టి మహిళలకు స్వయంగా ఫ్రీ టికెట్ కొట్టారు. దీంతో కొందరు దళపతికి చాక్లెట్లు ఇచ్చారు. ఈ వీడియోలు సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ర‌‌వాణా హ‌‌క్కుల్లో భేదాలు ఉండ‌‌కూడద‌‌ని, స‌‌మాన‌‌త్వం ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించిన‌‌ట్లు మంత్రి ఏ విజ‌‌య్ త‌‌మిళ‌‌న్ పార్తిబ‌‌న్ వెల్లడించారు. ఈ స్కీమ్‌‌ను సామాజిక విప్లవంతో పోల్చారు. మ‌‌హిళ‌‌లు, ట్రాన్స్‌‌జెండ‌‌ర్ల విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక సాధికార‌‌త కోసం ఫ్రీ బస్ జ‌‌ర్నీ పథకం ఉప‌‌యోగ‌‌ప‌‌డుతుంద‌‌ని ఆయన తెలిపారు.

84.32 ల‌‌క్షల మంది మ‌‌హిళ‌‌లకు లబ్ధి

ఫ్రీ బ‌‌స్సు స్కీమ్ ద్వారా ప్రతిరోజూ సుమారు 84.32 ల‌‌క్షల మంది మ‌‌హిళ‌‌లు ల‌‌బ్ధి పొంద‌‌నున్నారు. త‌‌మిళ‌‌నాడులో ఉన్న ఏడు రాష్ట్ర ర‌‌వాణా సంస్థల‌‌కు చెందిన 12,695 బ‌‌స్సుల‌‌కు ఈ పథకం వ‌‌ర్తించ‌‌నున్నది. ఈ స్కీమ్​ పొందటానికి ఎలాంటి ఆదాయ పరిమితి లేదు. లబ్ధిదారులు ఒక రోజులో ఎన్ని ట్రిప్పులు చేస్తారన్న దానిపై కూడా లిమిట్​లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 

ఈ పథకం అధికార ‘తమిళగా వెట్రి కజగం’ (టీవీకే) నుంచి ఉద్భవించింది. దీని అర్థం ‘విజయవంతమైన ప్రయాణం’. గతంలో కొన్ని బస్సులకే పరిమితమైన ఈ సదుపాయాన్ని ప్రస్తుతం డీల‌‌క్స్‌‌, ఎక్స్‌‌ప్రెస్, మఫిసిల్ ఆర్డినరీ, ఘాట్ ఏరియా స‌‌ర్వీసులకూ టీవీకే సర్కారు విస్తరించింది.