హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ తన అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ సేవలను 120కి పైగా నగరాలకు విస్తరించింది. అమృత్‌సర్, జలంధర్, మంగళూరు, విశాఖపట్నం, కొచ్చి సహా అనేక ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
రోజువారీ కిరాణా సామగ్రి, తాజా పండ్లు, కూరగాయలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు వంటి వేలాది రకాల వస్తువులను నిమిషాల్లోనే వినియోగదారులకు అందిస్తున్నారు. సుమారు 800 మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ల ద్వారా ఆర్డర్లు వేగంగా కస్టమర్ల ఇండ్లకు వెళ్తాయి. రాబోయే కాలంలో 300లకు పైగా నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని అమెజాన్ తెలిపింది.
