కేంద్ర పథకాల అమలుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

కేంద్ర పథకాల అమలుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  •     గవర్నర్‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య  వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా సమగ్రమైన ప్రత్యేక కార్యాచరణ  రూపొందించాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్​ను కోరారు. కేంద్ర స్కీముల అమలులో క్షేత్రస్థాయిలో నెలకొన్న లోపాలను సరిదిద్దడంతో పాటు, జిల్లా స్థాయిలో పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌లో గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఏకరీతి మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. 

స్పార్ష్ ద్వారా అమలవుతున్న స్కీములతో పాటు మొత్తం 22 కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. కేంద్రం నిధులు కేటాయిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు తీరు సరిగ్గా లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న ఆయన.. ఈ స్కీములపై జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.