తూప్రాన్ మండలంలో అక్టోబర్ 4న అమిత్ షా పర్యటన..బ్రాహ్మణపల్లిలో అమూల్ మిల్క్ యూనిట్ కు శంకుస్థాపన

తూప్రాన్ మండలంలో అక్టోబర్ 4న అమిత్ షా పర్యటన..బ్రాహ్మణపల్లిలో అమూల్ మిల్క్ యూనిట్ కు శంకుస్థాపన
  •   పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు

తూప్రాన్, వెలుగు : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 4న మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో పర్యటించనున్నారు. గ్రామంలో ఏర్పాటు చేయనున్న అమూల్ బల్క్ మిల్క్ యూనిట్ కు అమిత్ షా శంకుస్థాపన చేయనున్నారు. 

అమిత్ షా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాస్ తెలిపారు. భద్రత, బందోబస్తు, రూట్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, అత్యవసర వైద్య సేవలపై శుక్రవారం తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. 

భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి అమిత్ షా పర్యటనను సక్సెస్​ చేయాలని చెప్పారు. సమావేశంలో పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఫుడ్ సేఫ్టీ, ఆర్అండ్​బీ, ఐఎస్​డబ్ల్యూ, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.