సాంస్కృతిక సారథిలో మరిన్ని ఉద్యోగాలు : మంత్రి జూపల్లి కృష్ణారావు

సాంస్కృతిక సారథిలో మరిన్ని ఉద్యోగాలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
  •     మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం
  •     కళాకారులను ఎవరూ అరెస్ట్ చేయలేదు
  •     బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న కళాకారులను ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తిస్తుందని, మరింత మందికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగావకాశాలు కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆందోళన చేపట్టిన కళాకారులను పోలీసులు ఎక్కడా అరెస్ట్ చేయలేదని, బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసమే దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

నిరసన తెలిపేందుకు నగరానికి వచ్చిన కళాకారుల కోసం లలిత కళాతోరణంలో తానే స్వయంగా వసతి ఏర్పాటు చేయించానని, రవీంద్రభారతిలో వారి సమస్యలను సావధానంగా విన్నానని మంత్రి గుర్తుచేశారు. కొంతమంది తన వాహనాన్ని అడ్డుకున్నారని, వారిని సముదాయించి అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో 3 నుంచి 6 నెలల వరకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కళాకారుల వేతనాన్ని రూ.24,514 నుంచి రూ.31,868కి పెంచి, ప్రతి నెలా ఒకటో తారీఖున వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు.