‘చైనా క్యాంపస్ అనే తప్పుడు ప్రచారం నమ్మొద్దు: శ్రీచైతన్య విద్యాసంస్థలు

‘చైనా క్యాంపస్ అనే తప్పుడు ప్రచారం నమ్మొద్దు: శ్రీచైతన్య విద్యాసంస్థలు

శ్రీచైతన్య–నారాయణ సంస్థల మధ్య ఎలాంటి ఒప్పందం లేదు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: శ్రీచైతన్య విద్యాసంస్థలు–నారాయణ విద్యాసంస్థల మధ్య “చైనా క్యాంపస్” పేరుతో భాగస్వామ్యం, ఒప్పందం కుదిరిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు, నిరాధారమైనదని శ్రీచైతన్య విద్యాసంస్థలు స్పష్టం చేశాయి. వైరల్ అవుతున్న పోస్టర్లు, సందేశాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సంస్థ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.

“చైనా క్యాంపస్” పేరుతో ఏ సంస్థతోనూ భాగస్వామ్యం, ఒప్పందం చేసుకోలేదని, అలాంటి ప్రతిపాదన కూడా తమ పరిశీలనలో లేదని ఆయన చెప్పారు. సంస్థ పేరు, లోగో, బ్రాండ్ గుర్తింపు లేదా అధికారిక సమాచారాన్ని అనుమతి లేకుండా ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు. కొత్త కార్యక్రమాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలు, అధికారిక ప్రకటనలను సంస్థ తన అధికారిక కమ్యూనికేషన్‌‌‌‌ చానళ్లలోనే వెల్లడిస్తుందని తెలిపారు.