- రూ.50 లక్షల విలువైన మెషీన్లు, మెటీరియల్ సీజ్
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ కమిషనరేట్టాస్క్ ఫోర్స్(గోల్కొండ జోన్), ఆసిఫ్‌నగర్ పోలీసులు శుక్రవారం మురాద్ నగర్‌లో గుట్కా తయారీ కేంద్రం గుట్టు రట్టు చేశారు. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన రోహిత్ కుమార్, రాజస్థాన్ కు చెందిన సౌరభ్ చౌహాన్, రాహుల్ పర్మార్ లను అరెస్ట్ చేయడంతోపాటు ఇద్దరు పిల్లలను రక్షించినట్లు పోలీసులు తెలిపారు.
తయారీదారు జుబేర్, భవన యజమాని ముజఫర్ పరారీలో ఉన్నారన్నారు. బాద్‌షా, సాగర్ బ్రాండ్ల పేరిట గుట్కా, పాన్ మసాలాలను తయారు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. రూ.50 లక్షల విలువైన 3 ప్యాకింగ్ యంత్రాలు, మిక్సింగ్ మెషీన్లు, ముడిసరుకు, ప్యాకింగ్ మెటీరియల్‌ను సీజ్‌చేశామన్నారు.
