త్వరలో దర్శకురాలిగా శ్రుతిహాసన్.. లేడీ ఓరియెంటెడ్ల థ్రిల్లర్‌తో డెబ్యూ!

త్వరలో దర్శకురాలిగా శ్రుతిహాసన్.. లేడీ ఓరియెంటెడ్ల థ్రిల్లర్‌తో డెబ్యూ!

శ్రుతిహాసన్ అంటే కేవలం స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. యాక్టింగ్‌‌తో పాటు మ్యూజిక్, సింగింగ్‌‌పై కూడా తనదైన ముద్ర వేసిన నటి.  ఇప్పుడు ఈ టాలెంటెడ్  ఆర్టిస్ట్  మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  త్వరలోనే శ్రుతిహాసన్ మెగాఫోన్ పట్టుకుని దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోందట.  అంతేకాదు.. తన డైరెక్షనల్ డెబ్యూను కూడా రెగ్యులర్   కమర్షియల్ కథతో కాకుండా ఓ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌‌తో ప్లాన్ చేస్తున్నట్టు కోలీవుడ్ టాక్. దీనికోసం ఆమె  గత కొంతకాలంగా  ఓ థ్రిల్లర్ కథపై వర్క్ చేస్తోందట.

ఈ ప్రాజెక్ట్‌‌లో తాను హీరోయిన్‌‌గా నటించకుండా, పూర్తిగా దర్శకురాలి బాధ్యతలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఈ సినిమాలో మరో కోలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించనుందని  ప్రచారం జరుగుతోంది. లిమిటెడ్ బడ్జెట్‌‌లో,  కంటెంట్‌‌కు ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను ప్రయోగాత్మకంగా రూపొందించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.  శ్రుతిహాసన్‌‌కు మ్యూజిక్‌‌పై కూడా  మంచి ఆసక్తి ఉండటంతో తన  డెబ్యూ మూవీకి దర్శకత్వంతో పాటు సంగీత బాధ్యతలను కూడా తానే తీసుకోబోతున్నట్టు  ప్రచారం జరుగుతోంది. అంటే ఆమె కెరీర్‌‌‌‌లో ఇది కొత్త మలుపు అనే చెప్పొచ్చు.   ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.