టీచర్లను బోధనకే పరిమితం చేయాలి : BTF రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య

టీచర్లను బోధనకే పరిమితం చేయాలి : BTF రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య

హైదరాబాద్, వెలుగు: టీచర్లపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించి, వారిని కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం చేయాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్(బీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన బీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. టీచర్లపై ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పనులు రుద్దడం, విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు తీసుకోవడంతో సమయం వృథా అయి బోధన దెబ్బతింటోందని చెప్పారు. 

స్కూళ్లలో టీచర్ల కొరత లేకుండా చూడాలని, వర్క్ అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల పేరుతో పైరవీలకు అనుకూలమైన పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వకుండా అవసరమున్న స్కూళ్లకే టీచర్లను పంపాలన్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్ హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలకు నిర్దిష్ట జాబ్ చార్ట్ అమలు చేయాలని, క్లాస్​రూముకు ఒక టీచర్​ను నియమించాలన్నారు. స్కూల్ గ్రాంట్లను గతంలో మాదిరిగా ఏఏపీసీ ద్వారా నేరుగా ఆయా స్కూల్ అకౌంట్లలోనే జమ చేయాలని డిమాండ్ చేశారు.