గెలిస్తే ప్రజా తీర్పు.. ఓడితే ఈవీఎంల తప్పా? : ఎంపీ కె.లక్ష్మణ్

గెలిస్తే ప్రజా తీర్పు.. ఓడితే ఈవీఎంల తప్పా? : ఎంపీ కె.లక్ష్మణ్
  •     కాంగ్రెస్​ను ప్రశ్నించిన ఎంపీ కె.లక్ష్మణ్ 

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తున్న ప్రతీసారి వీఎంలు, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పడి ఏడుస్తోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు. కర్నాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో గెలిస్తే ప్రజా తీర్పని, మిగతా చోట్ల ఓడిపోతే ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ చోరీ అనడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం బీజేపీ ఆఫీస్​ లో ఆ పార్టీ ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేంద్ర ఎన్నికల సంఘం చట్టబద్ధంగా దొంగ ఓట్లు, చనిపోయినవారి పేర్లను తొలగించి ఓటర్ జాబితా ప్రక్షాళన చేస్తుంటే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఎందుకంత కడుపుమంట అని ప్రశ్నించారు. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ దొంగ ఓట్లను కాపాడేందుకు కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి దేశవ్యాప్తంగా చేపట్టింది సేవ్ డెమోక్రసీ మార్చ్ కాదని, కేవలం గాంధీ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న సేవ్ డైనాస్టీ మార్చ్ అని ఎద్దేవా చేశారు.