గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోనే ఉన్న.. టికెట్ అడగలేదని, తప్పుకున్నానని అసత్య ప్రచారం చేస్తున్నరు : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ బరిలోనే ఉన్న.. టికెట్ అడగలేదని, తప్పుకున్నానని అసత్య ప్రచారం చేస్తున్నరు : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

గరిడేపల్లి, వెలుగు : నల్గొండ, -ఖమ్మం, -వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నానని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. తాను టికెట్ అడగలేదని, ఎమ్మెల్సీ పోటీకి సిద్ధంగా లేనని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. 

తన దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాల గురించి గతంలో మాట్లాడిన విషయాలను ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపెట్టి వక్రీకరించడం సరికాదన్నారు. రెండు సీట్లను రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడం పట్ల బీసీ వర్గాల్లో ఆగ్రహం వచ్చిందని, అందుకే అభ్యర్థిని మార్చబోతున్నారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. 

సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా ఊహాగానాలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం అన్నారు. హైకమాండ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు. పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.