- రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లిలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: అభంశుభం తెలియని నాలుగేండ్ల చిన్నారిపై 40 ఏండ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేండ్ల చిన్నారి బుధవారం సాయంత్రం ఒంటరిగా ఆడుకుంటుండగా.. ఇంటి ప్రక్కనే ఉండే నరేందర్ మొబైల్చూపిస్తానంటూ ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి యత్నించాడు.
కొద్దిసేపటికి ఇంటికి వెళ్లిన చిన్నారి నొప్పితో బాధపడటాన్ని గమనించి తల్లిదండ్రులు ఆరా తీయగా జరిగిన ఘోరాన్ని చెప్పింది. దీంతో వారు నిందితుడిపై మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నట్లు చెప్పారు.
