హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతీయ కార్పొరేట్ రంగం నిలదొక్కుతుందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ ప్రశంసించింది. దీని రిపోర్ట్ ప్రకారం.. కంపెనీల క్రెడిట్ నాణ్యత మెరుగుపడింది. క్రెడిట్ రేటింగ్ పెంపుదల నిష్పత్తి గతేడాది ద్వితీయార్ధంలో 1.93 శాతంగా ఉండగా, ప్రస్తుత ప్రథమార్థంలో 3.95 శాతానికి చేరింది.
ఈ కాలంలో మొత్తం 300 రేటింగ్ అప్గ్రేడ్స్ఉన్నాయి. గత దశాబ్ద కాలంతో పోలిస్తే బ్యాలెన్స్ షీట్లు మరింత ఆరోగ్యకరంగా మారాయి. 2016–2026 మధ్య కంపెనీల అప్పులు సగానికి తగ్గిపోయాయి. లాభాల మార్జిన్లు 10 శాతం నుంచి 14 శాతానికి పెరిగాయి. దేశీయంగా గృహ వినియోగం బలపడటం, పెట్టుబడులు పుంజుకోవడం వంటివి ఎకానమీకి ఊపునిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులు, బ్యాంకింగ్ రంగాలలో క్రెడిట్ నాణ్యత ఆశించినస్థాయిలో వృద్ధి చెందింది.
