తెలుగు రాష్ట్రాల్లో బర్గర్ సింగ్ విస్తరణ.. ఆర్నెళ్లలో పది స్టోర్ల ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో బర్గర్ సింగ్ విస్తరణ.. ఆర్నెళ్లలో పది స్టోర్ల ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: స్వదేశీ బర్గర్ బ్రాండ్ బర్గర్ సింగ్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో విస్తరణ బాట పట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ, వచ్చే ఆరు నెలల్లో నగరంలో మరో 10 కొత్త స్టోర్లను ప్రారంభించనుంది.

తిరుపతిలో తొలి ఔట్​లెట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఈ సంస్థ అడుగుపెట్టింది. రాబోయే కొన్నేళ్లలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తూర్పు గోదావరి ప్రాంతాలతో పాటు వివిధ టైర్-2, టైర్-3 పట్టణాలలో 60కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.