న్యూఢిల్లీ, వెలుగు: అక్టోబర్ 22 న హైదరాబాద్ వేదికగా జరగనున్న ‘అలయ్ బలయ్ –2026’ కార్యక్రమానికి రావాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు.
ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మితో కలిసి ఆయన కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలయ్ బలయ్ ప్రోగ్రాం ఉద్దేశాన్ని
రాజ్ నాథ్ సింగ్ కు వివరించారు.
