- పీసీసీ ఎస్సీ విభాగం హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: దళితుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర నేతలు డా. ఏ.రాజేందర్, హెచ్ఆర్ మోహన్, హైమావతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హెచ్చరించారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉద్యమ నేతగా కేసీఆర్ ను గౌరవిస్తామని, అదే సమయంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై, దళితుల సంక్షేమం కోసం పాటు పడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
ఇంకోసారి ఇలాంటి విమర్శలు చేస్తే అన్ని నియోజకవర్గాల్లో దళిత సంఘాల నేతలంతా పర్యటించి బీఆర్ఎస్ అవినీతి బాగోతాలను బయటపెడుతామని హెచ్చరించారు.
