కాంగోలో ఎబోలా విజృంభణ..4 వేలు దాటిన మరణాలు

కాంగోలో ఎబోలా విజృంభణ..4 వేలు దాటిన మరణాలు

బునియా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 4 వేల మార్కును దాటినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 8,300 మందికి ఈ వైరస్ నిర్ధారణ కాగా, వారిలో 4,018 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎబోలా వ్యాప్తికి కారణమైన ‘బుండిబుగ్యో’ వైరస్ కట్టడికి ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట చికిత్స లేదు. 

మరోవైపు, వేతన బకాయిల కోసం బునియాలో ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన చేపట్టడం వ్యాధి నియంత్రణ చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ఇప్పటివరకు 50 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు ఎబోలాతో కన్నుమూశారని సమాచారం.