ఆర్చరీలో ఇండియా విలుకాండ్ల జోరు కొనసాగుతోంది. రికర్వ్ విభాగంలో శుక్రవారం స్వర్ణం, రెండు రజతాలను సాధించారు. అంకిత భగత్–కీర్తి శర్మ–కుంకుమ్ మోహద్‌తో కూడిన ఇండియా విమెన్స్ రికర్వ్ జట్టు ఫైనల్లో 5–3 (54–54, 56–56, 55–51, 54–54)తో డిఫెండింగ్ చాంపియన్ కొరియా (కాంగ్ చాయోంగ్–ఓ యోజిన్–లీ యుంజి)ను ఓడించింది.
మిక్స్‌డ్ రికర్వ్ టీమ్ ఫైనల్లో కుంకుమ్–ధీరజ్ బొమ్మదేవర 3–5 (34–38, 35–37, 37–36, 37–37)తో చైనా చేతిలో ఓడి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ధీరజ్–సంజయ్ భోగే–నీరజ్ చౌహాన్‌తో కూడిన మెన్స్ రికర్వ్ టీమ్ 1–5 (56–56, 50–57, 54–56తో కొరియా చేతిలో ఓడి సిల్వర్‌తో సంతృప్తి పడింది.
