ఏఐ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్‌డ్ అవుతోందో.. దాని దుర్వినియోగం కూడా అదే స్థాయిలో హద్దులు దాటుతోంది. ఏది నిజమో, ఏది ఫేక్ అనేది తేల్చడం రోజురోజుకూ కష్టంగా మారుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కృత్రిమ మేధ సాయంతో మార్చి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం కొత్త తలనొప్పిగా మారింది. లేటెస్ట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, తన తలనీలాలను సమర్పించి గుండుతో కనిపిస్తున్నారంటూ కొన్ని పిక్స్ ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఫొటోలు పూర్తిగా డిజిటల్ మార్ఫింగ్, ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన నకిలీ చిత్రాలు అని తేలింది.
►ALSO READ | Box Office War: త్రివిక్రమ్ vs సీఎం విజయ్ కుమారుడు.. బాక్సాఫీస్ వార్లో గెలిచేది ఎవరు?
అసలు విషయమేమిటంటే.. గతంలో తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాటి పాత ఫొటోలనే కొందరు అకతాయిలు AIతో మోసపూరితంగా ఎడిట్ చేశారు. ఒరిజినల్ పిక్స్‌లో ఆమె ధరించిన తెలుపు రంగు డ్రెస్, ఆకుపచ్చ దుపట్టా, చెవిపోగులు అలాగే ఉంచి, కేవలం జుట్టును మాత్రమే ఏఐ సాయంతో తొలగించి గుండు చేయించుకున్నట్లు భ్రమ కలిగించారు. అభిమానులు ఈ ఫొటోల్లోని ప్లాస్టిక్ ఫినిషింగ్, లైటింగ్ తేడాలను గమనించి ఇవి ఫేక్ అని తేల్చిచెప్పారు. సాంకేతికతను సృజనాత్మకతకు వాడాలి కానీ, ఇలా సెలబ్రిటీల ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Nayanthara🤯🤯 pic.twitter.com/AuJUurZLrt
— sabas csk (@saba9361) August 16, 2026
ప్రస్తుతం నయనతార యష్ సరసన పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్ 'లో నటిస్తుంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతోంది. గోవా మాఫియా నేపథ్యంలో గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషీ వంటి భారీ తారాగణం ఉంది. మరోవైపు సల్మాన్ ఖాన్ సరసన కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టడంతో నయనతార ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చారు.
#Nayanthara & #VigneshShivan visit Tirumala to seek the blessings of Lord Venkateshwara 🙏✨ pic.twitter.com/xwJU0ZDszo
— Jitendra (@Jitendra_9012) April 9, 2026
