బుల్లెట్ బండి మీద KBR పార్క్ చుట్టూ తిరిగి ట్రాఫిక్ పర్యవేక్షించిన సీపీ సజ్జనార్

బుల్లెట్ బండి మీద KBR పార్క్ చుట్టూ తిరిగి ట్రాఫిక్ పర్యవేక్షించిన సీపీ సజ్జనార్

హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న హెచ్‌‌సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మంగళవారం (ఆగస్ట్ 18) నుంచి వన్ వే అమలైంది. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ టూ వీలర్‎పై కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి ట్రాఫిక్ పర్యవేక్షించారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. 

కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న హెచ్‌‌సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మంగళవారం నుంచి వన్ వే అమలైంది.  ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్  మాట్లాడుతూ.. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్‌‌లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.  వన్​వే ఉందని, ఎవరైనా దగ్గరి దారి అంటూ రాంగ్​సైడ్​డ్రైవింగ్​చేస్తే సీరియస్​యాక్షన్​తీసుకుంటామన్నారు. పార్క్ చుట్టూ వాహనాలు రాకపోకలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హై రైజ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. అలాగే,  పార్కుకు వచ్చే వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని, సూచించిన ప్రాంతంలోనే విజిటర్స్ పార్కింగ్ చేసుకోవాలన్నారు. 

గూగుల్​ మ్యాప్​ ఫాలో కండి  

పార్కు చుట్టూ నిర్దిష్ట యూ-టర్న్‌‌లు, ఎగ్జిట్ పాయింట్లతో కూడిన కొత్త వన్-వే రూట్ మ్యాప్‌‌ను గూగుల్ మ్యాప్స్‌‌లో సవరించారు. ప్రయాణానికి ముందు దారి మార్పులను గూగుల్ మ్యాప్స్ ద్వారా సరిచూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. 

13 ఎగ్జిట్​ పాయింట్లు, 10 లైన్​ ఛేంజర్లు  

వాహనదారులు ఇబ్బందులు పడకుండా వన్-వే లూప్ నుంచి బయటకు వెళ్లి ఇతర ప్రధాన రహదారుల్లోకి ప్రవేశించడానికి 13 ఎగ్జిట్ పాయింట్లు, 10 లైన్​ఛేంజర్లు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రయాణించేటప్పుడు దారి మారడానికి కేవలం ఈ 10 ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. పార్క్ చుట్టూ ఏర్పాటు చేసిన సైన్​బోర్డులను గమనిస్తూ, ఎగ్జిట్ అవ్వడానికి ముందే నిర్ణీత లేన్ ఛేంజర్స్ ద్వారా సరైన లైన్​లోకి మారాలన్నారు. పార్క్​చుట్టూ ఎక్కడా నేరుగా రైట్ టర్న్‌‌ తీసుకోవడానికి అనుమతి లేదన్నారు. 

మూడు షిఫ్టుల్లో పనులు   

కేబీఆర్ పార్కు చుట్టూ చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల పనులను వేగవంతం చేసేందుకు జీహెచ్‌‌ఎంసీ చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి పార్కు చుట్టూ వన్‌‌వే ట్రాఫిక్‌‌ విధానం అమల్లోకి రావడంతో పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్లాన్​చేశారు. ట్రాఫిక్‌‌ రద్దీకి ఇబ్బందులు కలగకుండా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు.

►ALSO READ | మూడు రోజులు ఓపిక పట్టండి... ఇబ్బందులన్నీ క్లియర్ చేస్తాం... KBR పార్క్ ట్రాఫిక్ పై సజ్జనార్ కామెంట్స్..

రాత్రి,పగలు  మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పనుల పురోగతిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ  ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచనలు చేశారు. వన్ వే గురించి సమాచారం ఇస్తూ సోమవారం పార్కు చుట్టూ ప్లకార్డులు ప్రదర్శించారు.