కనీసం జాతీయ జెండా ఎలా ఉంటుందో కూడా తెలియదా? అల్లు అర్జున్ పై నెటిజన్లు ట్రోల్స్!

కనీసం జాతీయ జెండా ఎలా ఉంటుందో కూడా తెలియదా?  అల్లు అర్జున్ పై నెటిజన్లు ట్రోల్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస రికార్డులతో దూసుకుపోతున్నారు. అయితే ఎంత తక్కువ సమయంలో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్నారో.. అంతే వేగంగా వివాదాలు కూడా ఆయనను చుట్టముడుతున్నాయి. లేటెస్ట్ గా మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్‌గా 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బన్నీ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర తుఫాను రేపింది.

మువ్వన్నెల జెండా వివాదం..

ఇండిపెండెన్స్ డే సందర్భంగా అల్ల అర్జున్ టీమ్ డిజైన్ చేసిన ఒక స్పెషల్ పోస్టర్‌ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎర్రకోట నేపథ్యంలో రూపొందించిన ఆ ఆర్ట్‌వర్క్‌లో భారత జాతీయ జెండాపై 'అశోక చక్రం' మాయమైపోవడం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. దానికితోడు జాతీయ పతాకంతో పాటు ఎర్రకోటపై అల్లు అర్జున్ పర్సనల్ బ్రాండింగ్ లోగోను ప్రొమినెంట్‌గా పెట్టడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కనీసం జాతీయ జెండా ఎలా ఉంటుందో కూడా తెలీదా?' అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. వివాదం ముదరడంతో ఆ పోస్ట్‌ను డిలీట్ చేసినప్పటికీ, ఆ స్క్రీన్‌షాట్లు తీసిన నెటిజన్లు.. నెట్టింట వైరల్ చేశారు. 

ఫుల్ బిజీగా... 

ఈ వివాదాలను మధ్య బన్నీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు మాత్రం ఇండియా లెవెల్లో క్రేజీ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న 'రాకా'లో నటిస్తున్నారు.  ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఊహించని రేంజ్ లో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తుండగా.. జాన్వీకపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో అలరించనున్నారు.

►ALSO READ | Ravi Teja: U/A సర్టిఫికెట్తో థియేటర్లోకి ‘ఇరుముడి’.. పెయిడ్ ప్రీమియర్లపై మేకర్స్ కీలక నిర్ణయం!

 దాదాపు రూ. 1000 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. లోకేష్ కనగరాజ్‌తో ప్రకటించిన AA23 కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుతోంది. 2027లో 'రాకా'ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.