అర్జున అవార్డు విజేతలకు ప్రైజ్మనీ ఎంతిస్తారో తెలుసా?.. పూర్తి వివరాలు ఇదిగో!

అర్జున అవార్డు విజేతలకు ప్రైజ్మనీ ఎంతిస్తారో తెలుసా?.. పూర్తి వివరాలు ఇదిగో!

National Sports Awards 2025: కేంద్ర యువజన అండ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు 2025వ సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను అధికారికంగా ప్రకటించింది. ఈసారి అవార్డుల ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రాథమికంగా ఎంపిక కమిటీ 24 మంది పేర్లతో కూడిన ప్రతిపాదనలను పంపగా, క్రీడా మంత్రిత్వ శాఖ కేవలం 17 మందికి మాత్రమే ఆమోదం తెలిపింది. అంతేకాదు, ఈ ఏడాది దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన ధ్యాన్ చంద్ ఖేల్ రత్న విజేత ఎవరూ లేకపోవడం స్పోర్ట్స్ లవర్స్‌ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో 2014లో కూడా ఏ ఒక్కరికీ ఖేల్ రత్న ఇవ్వలేదు, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు అదే పునరావృతం కావడం గమనార్హం.

అర్జున అవార్డు విజేతలకు దక్కే గౌరవాలు ఏమిటి?: 

భారతదేశంలో ఖేల్ రత్న తర్వాత అత్యున్నత క్రీడా పురస్కారంగా అర్జున అవార్డుకు గుర్తింపు ఉంది. ఈ అవార్డుకు ఎంపికైన క్రీడాకారులకు క్రింది గౌరవాలు దక్కుతాయి. 

* అర్జునుడి కాంస్య విగ్రహం / మెడాలియన్ (Medallion/Statuette)
* ప్రశంసా పత్రం (Citation)
* అధికారిక వేడుక దుస్తులు (Ceremonial Dress)
* నగదు పురస్కారం (₹15 లక్షలు)

అవార్జుల ప్రకటనలో ఆలస్యం: 

ఈ పురస్కారాల ప్రకటనలో చాలా ఆలస్యం జరిగింది. అవార్డుల విశిష్టతను, అర్హతను కాపాడేందుకు (Preserve the integrity of the awards) ప్రతిపాదనలను పునఃపరిశీలించాల్సి రావడం వల్లే ఈ ఆలస్యం చోటు చేసుకుందని క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అర్హులైన క్రీడాకారులకు మాత్రమే ఈ పురస్కారాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన సమీక్ష నిర్వహించినట్లు అవార్డుల కమిటీ స్పష్టం చేసింది.

►ALSO READ | గిల్‌క్రిస్ట్‌ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన పంత్.. టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి! 

అర్జున అవార్డుల పూర్తి జాబితా :

* అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, ముహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి
* బ్యాడ్మింటన్: త్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్
* బాక్సింగ్: నరేందర్
* చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్
* డెఫ్ షూటింగ్: ధనుష్ శ్రీకాంత్
* హాకీ: లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్
* కబడ్డీ: సుర్జీత్, పూజ
* పారా షూటింగ్: రుద్రాంష్ ఖండేల్‌వాల్
* పారా అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్
* రోయింగ్: అర్వింద్ సింగ్
* షూటింగ్: అఖిల్ షెయోరాన్

అర్జున అవార్డు (లైఫ్‌టైమ్):
* ఫుట్‌బాల్: ఐ. అరుణై నాయగం

ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్):
* పర్వీర్ సింగ్ (అథ్లెటిక్స్)
* ఛోటే లాల్ యాదవ్ (బాక్సింగ్)
* నేహా నంద్ కుమార్ చవాన్ (షూటింగ్)

ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్):
* ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్)
* వీరేందర్ కుమార్ (రెజ్లింగ్)

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం:
* ఆర్మీ పారాలింపిక్ నోడ్
* పూణే (క్రీడల ప్రోత్సాహం, అభివృద్ధి)