సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి అంకెకు ప్రాముఖ్యత ఉంటుది. ఏ తేదీన జన్మించాం.. దాని మూలం ఏమిటి.. లక్కీనెంబర్ ఏమిటి..న్యూమరాలజిస్ట్ లు తెలిపిన వివరాల ప్రకారం ఏ తేదీన పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.. డబ్బు..ఐశ్వర్యం నిలవాలంటే ఏ తేదీన జన్మించాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి జీవితంలో జరిగే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఇది వారి భవిష్యత్తు, భాగస్వామి, ఉద్యోగం లేదా వ్యాపారం, ఐశ్వర్యం వంటి వివరాలను వెల్లడిస్తుంది. ప్రతి సంఖ్యకు ఒక అధిపతి గ్రహం ఉంటుంది. వీటి ఆధారంగా 6, 15, 24 తేదీలలో జన్మించిన వారికి రాడికల్ సంఖ్య 6 అవుతుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం 6 అనేది శుక్ర గ్రహానికి సంబంధించినదని పండితులు చెబుతున్నారు.
న్యూమరాలజిస్టులు తెలిపిన వివరాల ప్రకారం .. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, శ్రేయస్సు, విలాసం, అందం , భౌతిక సుఖాల విషయంలో కీలక పాత్ర పోషిస్తాడు. శుక్రుడు శుభ దృష్టితో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6,15, 24 తేదీలలో జన్మించిన వారు పుట్టుకతోనే లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతారని పండితులు చెబుతున్నారు. వారి జీవితాంతం డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ తేదీలలో జన్మించిన వారు ఎన్నడూ ఆర్థికంగా ఇబ్బంది పడరని పండితులు అంటున్నారు. సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వారి ఖజానా ఎప్పుడూ నిండుగా కళకళలాడుదుంది.
ఇక ఈ తేదీల్లో జన్మించిన వారు జనాలను ఆకర్షిస్తూ ఉంటారు. వారి మాటలను ఇతరులు బాగా విశ్వసిస్తారు. సమాజంలో గౌరవం.. కీర్తి .. ప్రతిష్ఠలు కలిగి ఉంటారు. వారు చేస్తున్న రంగంలో కీలక పాత్ర పోషించి ఎంతో ఉన్నత స్థితిని చేరుకుంటార.
న్యూమరాలజీ ప్రకారం రాడికల్ సంఖ్య 6 నెంబరు కలిగిన వ్యక్తులు స్వభావ రీత్యా చాలా ఉత్సాహంగా.. చలాకీగా ఉంటారు. ఈ మూడు తేదీల్లో ( 6,15,24) పుట్టిన వారు కుటుంబసభ్యులు, స్నేహితులతో ఎంతో అనుబంధాన్ని కలిగిఉంటారు. ఇతరులను వీరు ఇట్టే ఆకర్షిస్తారు. ఇతరుల బాధను అర్దం చేసుకొని వారికి సాయం చేసే మనస్థత్వాన్ని కలిగి ఉంటారు.
ఈ తేదీలలో జన్మించిన వారికి ఆధ్యాత్మికంగా కొంత శక్తి కలిగి ఉంటుంది. పూజలు.. వ్రతాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువుగా ఉంటుంది. ఏ ఇంట్లో నిత్యం పూజలు.. లక్ష్మీదేవి ఆరాధన వంటివి జరుగుతాయో.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందువలన ఎప్పుడు పేదరికానికి అవకాశం లేదు.. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆర్థిక లాభం పొందే అవకాశాలు కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని సంఖ్యాశాస్త్ర నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
