మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే, గోపాల్ గాడ్సేలు RSS రాష్ట్రీయ స్వయం సేవక్ లో క్రియాశీల సభ్యులు అని ప్రజాప్రతినిధుల కోర్టులో స్వయంగా చెప్పారు సావర్కర్ మనవడు సత్య. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి.. పూణె కోర్టులో పరువు నష్టం కేసు విచారణ జరుగుతుంది. ఈ విచారణకు సావర్కర్ మనవడు సత్య ఈ కోర్టుకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా సావర్కర్ మనవడు సత్య చెప్పిన సమాధానం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
సోమవారం (ఆగస్టు 17) స్పెషల్ జడ్జి అమోల్ షిండే ఎదుట జరిగిన క్రాస్-ఎగ్జామినేషన్‌లో , నాథూరామ్ గాడ్సేకు సొంత సోదరుడైన గోపాల్ గాడ్సే కుమార్తె తన తల్లి అని వెల్లడించారు సత్య. గాడ్సే, సావర్కర్ కుటుంబాలు రెండూ బంధువులేనని ఆయన ఒప్పుకున్నారు. మహాత్మా గాంధీ హత్య కేసులో నాథూరామ్‌తో పాటు గోపాల్, సావర్కర్‌ల పేర్లు కూడా నిందితులుగా ఉన్నాయని తెలిపారు.
గాంధీ హత్య కేసులో తన తాత గోపాలరావు గోడ్సే, వినాయక్ సావర్కర్ లపై ఆరోపణలు ఉన్నాయన్నది వాస్తవమని... మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా హౌస్‌కు వెళ్తుండగా, తన పెదనాన్న నాథూరామ్ గోడ్సే ఆయనను కాల్చి చంపారన్నది కూడా వాస్తవమని అన్నారు. మహాత్మా గాంధీపై కాల్పులు జరిపిన తర్వాత, ఆయన సుమారు 20 నిమిషాల పాటు ఎవరూ పట్టించుకోకుండా అక్కడే పడి ఉన్నారని తెలిపారు. ఆయన్ని ఎవరూ ఆసుపత్రికి తీసుకువెళ్లలేదని... గాంధీ పట్ల ఆనాటి ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది అని పేర్కొన్నారు.
►ALSO READ | హిమాచల్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఖర్చులు తగ్గించేందుకు భారీగా IAS, IPS పోస్టుల కోత..!
తమ తాతలు గోపాల్ గోడ్సే, నాథూరామ్ గోడ్సే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చురుకైన సభ్యులుగా ఉండేవారన్నది నిజమేనని... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండవ అధిపతి మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, దిగంబర్ బడగే కూడా మహాత్మా గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్నారన్న విషయం తనకు తెలియదని అన్నారు. నాథూరామ్ గోడ్సే హిందూ మహాసభ రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉండేవారన్నది కూడా నిజమేనని అన్నారు సత్య.
