ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్చండి: పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్చండి: పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆందోళన నెలకొన్న క్రమంలో మెరుగైన చికిత్స కోసం ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ కుటుంబసభ్యులు, పీటీఐ పార్టీ నాయకులు ఈమేరకు డిమాండ్ చేస్తున్న క్రమంలో మంగళవారం ( ఆగస్టు 18 ) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇమ్రాన్ ఖాన్ 48 గంటల్లోగా ఇస్లామాబాద్ లోకి షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 16 వరకు ఆయనకు అక్కడే చికిత్స అందించాలని స్పష్ట చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పీటీఐ శ్రేణులు. సుప్రీంకోర్టు తీర్పు చాలా సంతోషకరమని... ఇది ముందే జరిగి ఉంటే.. ఆయన కంటి చూపు, ఆరోగ్యం క్షీణించి ఉండేవి కావని అన్నారు పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారి.

►ALSO READ | CJP చలో పార్లమెంట్‎కు నో పర్మిషన్.. పరిస్థితి అదుపు తప్పడంతోనే లాఠీ చార్జ్: ఢిల్లీ పోలీస్

2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ పై ఆ తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. 2023 ఆగస్టు నుంచయి జైల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్ కుమారులు. జైల్లో ఉండగా ఆయన కుడి కంటి చూపు కూడా క్షీణించిందని లాయర్లు తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన కొన్ని కేసుల్లో స్టే లభించగా. మరికొన్ని పెండింగ్ లో ఉన్నాయి.ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై భారత్ సహా ప్రపంచ దేశాలకు చెందిన పలువురు వెటరన్ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.