మీ ఏరియాలో ఎయిర్‌టెల్, జియో, లేదా విఐ (Vi) నెట్‌వర్క్‌లలో ఏది బాగా పనిచేస్తుందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. ఇతరులను అడిగి తెలుసుకోవాల్సిన పనిలేకుండా, మీ ఇంట్లో నుంచే నిమిషాల్లో మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ మూడు టెలికాం కంపెనీలు అధికారిక వెబ్‌సైట్లలో 'నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్' ఫీచర్‌ను అందిస్తున్నాయి.
ఎయిర్‌టెల్ (Airtel) నెట్‌వర్క్ ఎలా చెక్ చేయాలి?
ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లోని కవరేజ్ మ్యాప్‌లోకి వెళ్ళి మీ అడ్రస్ లేదా పిన్ కోడ్ (PIN Code) ఎంటర్ చేస్తే సరిపోతుంది. అక్కడ మీ ప్రాంతంలో ఎయిర్‌టెల్ 2G, 4G ఇంకా 5G నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో మ్యాప్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. 4G, 5G కవరేజీని విడివిడిగా కూడా ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు.
జియో (Jio) నెట్‌వర్క్ ఎలా చెక్ చేయాలి?
జియో వెబ్‌సైట్‌లోని కవరేజ్ మ్యాప్‌లో మీ అడ్రస్ లేదా పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీ ఇంటి దగ్గర ఉన్న నెట్‌వర్క్ వివరాలు తెలుస్తాయి. ఇందులో 4G, 5G సహా 4G+5G లభ్యతను వేర్వేరుగా చూసే ఆప్షన్లు ఉంటాయి.
►ALSO READ | అంబానీ మైండ్ గేమ్: ప్రైమ్ మెంబర్‌షిప్ రీలాంఛ్.. జియో రీఛార్జ్ ప్లాన్స్ పెంపు నుంచి రక్షణ!
విఐ (Vi) నెట్‌వర్క్ ఎలా చెక్ చేయాలి?
Vi (వోడాఫోన్ ఐడియా) కూడా కస్టమర్ల కోసం ఈ సదుపాయాన్ని అందిస్తోంది. Vi అధికారిక వెబ్‌సైట్ సందర్శించి మీ టెలికాం సర్కిల్ లేదా ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా అక్కడ 5G ఇంకా 4G నెట్‌వర్క్ కవరేజ్ ఎంతవరకు ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఏదైనా వేరే నెట్ వర్క్ కి పోర్ట్ అవ్వాలనుకునే వారు లేదా కొత్త సిమ్ తీసుకునే వారు ముందుగా ఈ విధంగా కవరేజ్ చెక్ చేసుకోవడం మంచిది.
