హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలోని కోటికి పైగా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. బీమా దరఖాస్తుల నమోదును ఆయన ప్రారంభించారు. వివిధ శాఖల కింద నేతన్నలు, గీత, కార్మికులు, మత్స్యకారులకు ఇప్పుడు అందుతున్న రూ.2 లక్షల జీవిత బీమాను ఈ పథకం గొడుగు కిందకు తెచ్చి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గురువారం (నవంబర్ 19) సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలో రూ.544.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రూ.451.13 కోట్లతో చేపట్టే కొత్త పనులకు భూమిపూజ చేసి, రూ.92.98 కోట్లతో పూర్తయిన భవనాలు, వసతులను ప్రజలకు అంకితం చేశారు. అనంతరం సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించి విధివిధానాలను వివరించారు.
ఊరూరా నమోదు కేంద్రాలు: ప్రభుత్వం
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నెల రోజుల పాటు సాగే నమోదు ప్రక్రియ కోసం ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక యాప్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని, అర్హులైన ప్రతి కుటుంబాన్నీ నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది.
