Cult OTT Release: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Cult OTT Release: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ మాస్ కాదాస్ విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కు ఈ వారం డబుల్ ధమాకా ..  ఒకవైపు ఆయన నటించిన 'ENE రిపీట్'  థియేటర్లలో సందడి చేస్తుంటే.. మరో వైపు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన స్లాషర్ థ్రిల్లర్ ' #కల్ట్' సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజ్ అయిన కేవలం 20 రోజుల్లోనే డిజిటల్ తెరపైకి రావడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నవంబర్ 19, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

20 రోజులకే ఓటీటీలోకి..

భారీ అంచనాల మధ్య అక్టోబర్ 30, 2026న  థియేటర్లలో విడుదలైన '#కల్ట్'కు బాక్సాపీస్ వద్ద ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీ సెన్సేషన్ 'స్క్విడ్ గేమ్' తరహా గేమ్స్, హత్యల కాన్సెప్ట్‌ను గుర్తు చేస్తోందంటూ కొన్ని వెబ్‌సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయింది. ఇప్పుడు థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులను ఓటీటీ ద్వారా ఆకట్టుకోవాలని చూస్తోంది.

కథేంటి?

గోవాలో హోంమంత్రి కుమారుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన పుట్టినరోజు వేడుకల కోసం '#కల్ట్' అనే పబ్‌ను బుక్ చేసుకుంటాడు. ఈ పార్టీకి హైదరాబాద్ నుంచి ముగ్గురు యువకులు వస్తారు. మొదట్లో మ్యూజిక్, డ్యాన్స్, పార్టీతో అంతా సందడిగా సాగుతుంది. కానీ ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు భయానకంగా మారిపోతాయి. పబ్‌లోని భారీ స్క్రీన్‌పై కనిపించే ఓ వింత బొమ్మ గేమ్స్ నిర్వహిస్తూ.. ఓడిపోయిన వారిని కిరాతకంగా హతమారుస్తుంది. అసలు ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అక్కడికి డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఎందుకు వచ్చాడు? ఈ మృత్యు క్రీడ నుంచి ఎవరు బయటపడ్డారు? అన్నదే అసలు కథ...

ఐదు భాషల్లో స్ట్రీమింగ్..

ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌కు జోడీగా గాయత్రీ భరద్వాజ్ నటించగా, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రజ్ఞ కీలక పాత్రలు పోషించారు. తరుణ్ భాస్కర్ సంభాషణలు అందించగా, రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. సందీప్ కాకరాల, కరాటే రాజు నిర్మించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

థియేటర్లలో నిరాశపరిచిన '#కల్ట్'కు ఓటీటీలో మాత్రం మరో అవకాశం దక్కింది. ఇంట్లో కూర్చొని థ్రిల్లర్ సినిమాలు, హారర్ ఎలిమెంట్స్, సర్వైవల్ గేమ్స్ చూడాలనుకునే వారికి ఈ చిత్రం ఒక ఆప్షన్‌గా నిలవనుంది. మరి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన విశ్వక్ సేన్ '#కల్ట్'.. ఓటీటీలోనైనా ప్రేక్షకుల మనసు గెలిచి సెకండ్ ఇన్నింగ్స్‌లో హిట్ కొడుతుందా? లేదా అనేది చూడాలి..