స్వామియే శరణం అయ్యప్ప: వరంగల్ నర్సంపేటలో మన శబరిమల

స్వామియే శరణం అయ్యప్ప: వరంగల్ నర్సంపేటలో మన శబరిమల

నర్సంపేటలోని శ్రీధర్మశాస్తా అయ్యప్ప గుడికి చాలా విశిష్టత ఉంది. ఇరవైయేండ్లుగా శబరిమల అయ్యప్పకి జరిగే పూజలన్నీ ఈ గుడిలోని అయ్యప్ప స్వామికి కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వేలమంది భక్తులు ఈ గుడిలో అయ్యప్ప మాల తీసుకుంటున్నారు. అందుకే ఈ గుడికి తెలంగాణ శబరిమలగా పేరొచ్చింది.

నర్సంపేటలోని వరంగల్ రోడ్లో ఉంది ఈ అయ్యప్ప గుడి. ఇరవైయేండ్ల కిందట శింగిరికొండ రామాంజనేయులు అనే ఆయన దాతల సాయంతో ఈ గుడి కట్టించాడు. అప్పట్నించీ ప్రతి ఏటాఈ అయ్యప్ప గుడిలో మాల తీసుకునే స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాంతో కార్తీక మాసంలో ఈ దేవాలయమంతా అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతోంది.

శబరిమలై తరహాలోనే..

కేరళలోని శబరిమలైలో జరిగే ఉత్సవ బలి, క్షేత్ర బలి, పల్లివేట, పంబారట్టు. నాలుగు పడి పూజలన్నీ ఈ గుడిలో కొలువై ఉన్న అయ్యప్పకీ జరుగుతాయి. పల్లివేట, పంబారట్టు ఉత్సవాలకు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా పుంగావనం. జలక్రీడ కోసం మాదన్నపేట చెరువుకి తీసుకెళ్తారు. 

ఈ రెండు ఉత్సవాల్ని చూడ్డానికి తెలంగాణతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కార్తీక మాసంలో 41 రోజుల పాటు అన్నదానం జరుగుతుంది. ఈ గుడిలో ఎనిమిదేళ్ల కిందట ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. దాంతో ఈ గుడిలో ప్రతి ఏటా వందల మంది హనుమాన్. మాలలు కూడా తీసుకుంటున్నారు.