మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఇరుముడి'. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడడటంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రవితేజ భార్యగా ప్రియ భవానీ శంక కనిపించనున్నారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో నటిస్తోంది
అయితే లేటెస్ట్ గా 'ఇరుముడి' లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' సాంగ్ లో చరణ్ కనించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
పాటలో చరణ్ కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఒక్కసారిగా హైప్ పెంచింది. రవితేజ–రామ్ చరణ్ కాంబినేషన్‌ను స్క్రీన్‌పై చూడాలన్న మెగా, మాస్ అభిమానుల కోరికతో ఈ రూమర్ మరింత వైరల్‌గా మారింది.
అయితే'ఇరుముడి' లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తున్నారన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ టీమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఆయన 'ఇరుముడి'లో భాగం కావడం లేదని చెబుతుంది. దీంతో కామియోపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. అయితే చరణ్ లేకపోయినా 'ఇరుముడి'పై క్రేజ్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఇందులో రవితేజ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఓ మద్యానికి బానిసైన తండ్రిగా కనిపించనున్నారు. తనకు కూతురంటే ప్రాణం. ఆమె ప్రేమను, నమ్మకాన్ని తిరిగి గెలుచుకునేందుకు అతడు చేసే ప్రయాణమే కథకు ప్రధాన బలం.
కూతురి కోసం మద్యం మానేయడం, అయ్యప్ప దీక్ష చేపట్టడం, ఆ తర్వాత ఎదురయ్యే ప్రమాదాలు.. ఇలా కుటుంబ భావోద్వేగాలకు భక్తి, యాక్షన్, థ్రిల్‌ను జోడించిన కథగా 'ఇరుముడి'ను శివ నిర్వాణ తెరకెక్కించారు. అత్యంత తీవ్రంగా, భావోద్వేగంగా ఉంటాయని దర్శకుడు చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'ఇరుముడి కట్టు' పాటకు మంచి స్పందన వచ్చింది.
ALSO READ : అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి ఫిక్స్.. వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు వైరల్
మొత్తానికి.. చరణ్ కామియో లేదన్న క్లారిటీ వచ్చినా.. రవితేజ 'ఇరుముడి'పై మాత్రం అంచనాలు తగ్గలేదు. తండ్రి–కూతురు బంధం, అయ్యప్ప భక్తి, గ్రామీణ నేపథ్యం, యాక్షన్, మిస్టరీ.. ఇవన్నీ కలిసి థియేటర్లలో ఎలాంటి అనుభూతిని ఇస్తాయో చూడాలంటే ఆగస్టు 21 వరకు ఆగాల్సిందే..
