BSNL 5G వచ్చేస్తోంది.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సేవలు.. కస్టమర్లకు పండగే ..

BSNL 5G వచ్చేస్తోంది.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సేవలు.. కస్టమర్లకు పండగే ..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ  బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది చివరినాటికి, అంటే డిసెంబర్ 2026లోగా దేశంలో 5G సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతుంది.  అయితే బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం వాడుతున్న 4G టవర్లు, డివైజెస్  5Gకి మార్చడానికి పెద్దగా కొత్త హార్డ్‌వేర్ అవసరం లేదు. కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేస్తే సరిపోతుంది.

మీ దగ్గర సాధారణ 4G SIM ఉంటే, 5G వాడటానికి కచ్చితంగా కొత్త SIM తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒకవేళ మీ దగ్గర ఇప్పటికే '5G-Ready SIM' ఉంటే మాత్రం SIM మార్చాల్సిన పనిలేదు.

ఇండియాలోనే తయారైన సొంత సాంకేతికతతో ఇప్పటికే 5G ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 5G రోలవుట్ కంటే ముందు ప్రస్తుతం ఉన్న 4G నెట్‌వర్క్‌ను పూర్తిగా రెడీ చేయడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ఇందుకు కేరళలో ఉన్న 7,200 టవర్లతో పాటు, దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 26,300 టవర్లను 5Gకి సులభంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. నెట్‌వర్క్ సరిగ్గా లేని ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు సహా లక్షద్వీప్‌లో కొత్త టవర్లను నిర్మిస్తున్నారు.

ALSO READ : క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. యాక్సిస్ బ్యాంక్ రూల్స్ మార్పు!

రూ. 1 ఆఫర్ 
ఇదిలా ఉండగా, BSNL కూడా  స్వాతంత్ర  దినోత్సవ సందర్భంగా ఒక స్పెషల్  ఆఫర్‌ తీసుకొచ్చింది. దింతో కొత్త కస్టమర్‌లు కేవలం రూ.1కే 24 రోజుల పాటు రోజుకు 1GB డేటా, 100 SMSలు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే.