క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. యాక్సిస్ బ్యాంక్ రూల్స్ మార్పు!

క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. యాక్సిస్ బ్యాంక్ రూల్స్ మార్పు!

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక. ఆగస్టు 28, 2026 నుంచి బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రూల్స్, ఛార్జీలలో కీలక మార్పులు చేయనుంది. విదేశీ చెల్లింపులు, లేట్ ఫీజులు, పాక్షిక బిల్లుల సర్దుబాటు, గిఫ్ట్ కార్డ్ కొనుగోళ్లు, టోల్ లావాదేవీలపై ఈ కొత్త రూల్స్ ప్రభావం చూపనున్నాయి. ఈ మార్పుల గురించి ముందే తెలుసుకోవడం ద్వారా అదనపు ఛార్జీలు రివార్డ్ పాయింట్ల కోల్పోవటం నుంచి తప్పించుకోవచ్చు.

ముఖ్యంగా విదేశాల్లో డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జ్ 1.5 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. విదేశీ పర్యటనల్లో లేదా విదేశీ మర్చంట్ల వద్ద భారత రూపాయిల్లో చెల్లించేటప్పుడు ఈ ఫీజు వర్తిస్తుంది. లక్ష రూపాయల లావాదేవీపై ఈ ఛార్జ్ గతంలో ఉన్న రూ.15 వందల నుంచి రూ.3వేల 500 కు పెరుగుతుంది. కాబట్టి ప్రయాణాల సమయంలో స్థానిక కరెన్సీని ఎంచుకోవడం మంచిది. అలాగే రూ. 50వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి లేట్ ఫీజు రూ.13వందలుగా నిర్ణయించింది బ్యాంక్.

పాక్షిక బిల్లులు చెల్లించే విధానంలోనూ మార్పులు వచ్చాయి. మీరు చెల్లించే మొత్తం ముందుగా ఫీజులు, ఇతర ఛార్జీలకు మళ్లించబడుతుంది. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ బకాయిలు, వడ్డీ, షాపింగ్స్, క్యాష్ విత్ డ్రాలను సర్దుబాటు చేస్తారు. దీనివల్ల పాక్షిక చెల్లింపులు చేసినప్పటికీ బకాయిలు వెంటనే తగ్గకపోవచ్చు.

ALSO READ : బజాజ్ పల్సర్ 125 అప్‌డేట్‌..కొత్త డిస్‌ప్లేతో లుక్ అద్దిరిపోయిందిగా ! 

రివార్డులపై కూడా కోత పడింది. గిఫ్ట్ కార్డ్ కొనుగోళ్లకు ఇకపై రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ లభించవు. అలాగే ఈ ఖర్చులు మైల్ స్టోన్ స్పెండింగ్ పరిమితికి లెక్కించబడవు. టోల్ ఫీజుల చెల్లింపులు కూడా రివార్డులకు అనర్హమైనవిగా మారాయి. ఈ నిబంధనల నుంచి రక్షణ పొందడానికి వినియోగదారులు ప్రతి నెలా పూర్తి బిల్లును గడువులోగా చెల్లించడం బెటర్.