కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొనడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ( అక్టోబర్ 5 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న వీరా కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా సోమయాజులపల్లి దగ్గర యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొనడంతో బోల్తా పడింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
