న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లకు ఈ వారం అత్యంత కీలకం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం, టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, అంతర్జాతీయ బాండ్ ఈల్డ్స్ మార్కెట్ డైరెక్షన్‌ను నిర్దేశించనున్నాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్‌లో వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచే అవకాశం ఉంది.
మీటింగ్ వివరాలు ఈ నెల 7 న వెలువడతాయి. 6న వెలువడే హెచ్‌ఎస్‌బీసీ సర్వీసెస్ పీఎంఐ డేటా కూడా కీలకం. అక్టోబర్ 8న ఐటీ కంపెనీ టీసీఎస్, రిటైల్ కంపెనీ డీమార్ట్ తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి.
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 100 డాలర్ల పైన ఉండటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, ఫారిన్ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా గత ఎనిమిది వారాలను సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగించాయి. గత వారం సెన్సెక్స్ 1,986 పాయింట్లు, నిఫ్టీ 718 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే.
