రష్యాలో ప్లేగు మహమ్మారి విజృంభణ ? ల్యాబ్లో ఈ అమ్మాయి చావుతో భయంభయం.. క్వారంటైన్కు వందల మంది..

రష్యాలో ప్లేగు మహమ్మారి విజృంభణ ? ల్యాబ్లో ఈ అమ్మాయి చావుతో భయంభయం.. క్వారంటైన్కు వందల మంది..

రష్యాలో ప్లేగు వ్యాధి ప్రబలిందన్న వార్తలు ఆ దేశ ప్రజలతో పాటు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. రష్యాలో.. ప్లేగు బ్యాక్టీరియాతో ఉన్న టెస్ట్ ట్యూబ్‌ ప్రమాదవశాత్తూ కింద పడి పగిలిపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన పరిశోధకురాలు దర్యా షిపిలోవా మరణించడం ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతుందన్న భయాన్ని రెట్టింపు చేసింది. రష్యా వైద్య అధికారులు ఆమెతో కాంటాక్ట్లో ఉన్న దాదాపు 200 మందిని మెడికల్ క్వారంటైన్లో ఉంచారు.

ప్లేగు వ్యాధి ప్రబలిన ప్రాంతంగా చెబుతున్న ఇర్కుట్స్క్ ప్రాంతంలోని షెలెఖోవ్‌ పట్టణంలో పరిస్థితి.. అక్కడి ల్యాబ్లో జరిగిన ఘటన.. చైనాలో కోవిడ్-19 వ్యాప్తికి కారణమైన వుహాన్ కేసును పోలి ఉందని రష్యా మీడియా ఛానెల్ 'నెజిగార్' హెచ్చరించింది. అయితే.. భయాందోళనలు అవసరం లేదని.. ఇప్పటివరకు గుర్తించిన వారిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు కనిపించలేదని.. వారి పరీక్ష ఫలితాలు కూడా నెగటివ్‌గా వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగు ఇన్‌స్టిట్యూట్‌లో 28 ఏళ్ల టెక్నీషియన్ అయిన దర్యా షిపిలోవా, యెర్సినియా పెస్టిస్ అనే సజీవ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్‌ను ప్రమాదవశాత్తు పగలగొట్టిన కొద్ది రోజులకే.. అక్టోబర్ 1, 2026న చనిపోయింది. ఆమె తీవ్రమైన న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ, ఆ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది.

►ALSO READ | రష్యా ల్యాబ్లో పగిలిన టెస్ట్ ట్యూబ్.. బయటికొచ్చిన డేంజరస్ ఇన్ఫెక్షన్.. వ్యాధి సోకి చనిపోయిన ల్యాబ్ టెక్నీషియన్ !

ప్రభుత్వ అధికారిక ప్రకటనలు మొదట్లో ఈ ఘటనను తెలియని.. అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌గా పేర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత స్థానిక అధికార యంత్రాంగం దీనికి కారణం ప్లేగు వ్యాధే అని ధృవీకరించారు. న్యుమోనిక్ ప్లేగు వ్యాధి శ్వాసకోశ తుంపరల ద్వారా అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. రష్యాలో ప్లేగు వ్యాధి ప్రబలిందన్న వార్తలతో అమెరికా అలర్ట్ అయింది. అమెరికాలో హై అలర్ట్ ప్రకటించింది.