నాలుగేళ్ల తర్వాత.. సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ తో మిథిలా పాల్కర్ 

నాలుగేళ్ల తర్వాత.. సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ తో మిథిలా పాల్కర్ 

ఓవైపు సినిమాలు, మరోవైపు ‘లిటిల్ థింగ్స్‌‌’ లాంటి వెబ్‌‌ సిరీస్‌‌లతో యూత్‌‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌‌ క్రియేట్‌‌ చేసుకున్న మిథిలా పాల్కర్.. విలక్షణమైన పాత్రలతో కెరీర్‌‌‌‌లో దూసుకెళ్తోంది.  ఈ ఏడాది ఇప్పటికే ‘హ్యాపీ పటేల్‌‌: ఖతర్నాక్‌‌ జాసూస్‌‌’తో పాటు అక్షయ్ కుమార్‌‌‌‌తో కలిసి ‘భూత్‌‌ బంగ్లా’ అనే హిందీ చిత్రంతో ఆకట్టుకుంది.  తాజాగా ‘సూపర్ సుబ్బు’ వెబ్‌‌ సిరీస్‌‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

సందీప్ కిషన్ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రూరల్ కామెడీ డ్రామాలో స్వాతి అనే పాత్రలో ఆమె నటించింది. గురువారం నుంచి నెట్‌‌ఫ్లిక్స్‌‌లో ఈ వెబ్‌‌ సిరీస్‌‌  స్ట్రీమ్ అవుతోంది.  మాకీపూర్‌‌‌‌ అనే విలేజ్‌‌లో రీల్స్‌‌ చేస్తూ హీరోయిన్‌‌ అవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్న అమ్మాయిగా తన నటన,  స్క్రీన్‌‌ ప్రెజెన్స్‌‌ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. 

నాలుగేళ్ల క్రితమే విశ్వక్‌‌ సేన్‌‌కు జంటగా ‘ఓరి దేవుడా’ చిత్రంతో టాలీవుడ్‌‌కు పరిచయమైంది మిథిలా.  అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో మళ్లీ ఆమె తెలుగులో కనిపించడానికి నాలుగేళ్లు పట్టింది. మరి ఈసారైనా తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి!