Just Married: 2023లో మొదలైన ప్రేమ.. ప్రియుడితో ఏడడుగులు వేసిన టాప్ సింగర్..

Just Married: 2023లో మొదలైన ప్రేమ.. ప్రియుడితో ఏడడుగులు వేసిన టాప్ సింగర్..

హాలీవుడ్ స్టార్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు అమెరికన్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ కెల్సీతో (Taylor Swift) ఏడడుగులు వేసింది. ఈ సందర్భంగా న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ జంట పెళ్లిచేసుకున్నట్లుగా సింగర్ టేలర్ స్విప్ట్ ఆమె ప్రతినిధి వెల్లడించారు.

ముఖ్యంగా వీరి పెళ్ళికి ప్రముఖ నటుడు, కమెడియన్ ఆడమ్ సాండ్లర్ పూజారిగా మారి ఆకట్టుకున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు హాలీవుడ్ మరియు క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వివాహం అనంతరం మాడిసన్ స్క్వేర్ గార్డెన్ బయట బిల్ బోర్డుల్లో వీరిద్దరి పేర్ల తొలి అక్షరాలు కలిసొచ్చేలా "JUST & T MARRIED" అని స్పెషల్ అనౌన్స్ చేశారు.

ఈ నేపథ్యంలో వేలాది మంది అభిమానులు పెళ్లి మండపం బయట ఉన్న బిల్ బోర్డు దగ్గరకి చేరుకొని కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న టేలర్ స్విఫ్ట్, అమెరికన్ ఫుట్‌బాల్‌లో ప్రముఖ ఆటగాడైన ట్రావిస్ కెల్సీ వివాహం ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో విశేష ఆసక్తిని రేకెత్తించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taylor Swift (@taylorswift)

2023లో ప్రేమలో పడ్డ జంట..

వివాహ వేడుకకు హాజరైన ప్రముఖుల్లో మాజీ ఫుట్‌బాల్ స్టార్ టామ్ బ్రేడీ, ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్, కమెడియన్ క్రిస్ రాక్, నటుడు హ్యూ గ్రాంట్, ఈథన్ హాక్, గ్వెన్ స్టెఫానీ, బెన్సన్ బూన్, జిమ్మీ ఫాలన్, జెన్నిఫర్ లోపెజ్, ఎడ్ షీరన్ తదితరులు ఉన్నారు. ఇకపోతే, టేలర్ స్విఫ్ట్ మరియు ట్రావిస్ కెల్సీ 2023లో ప్రేమలో పడ్డారు. అనంతరం 2025 ఏడాది ఆగస్టులో ఇద్దరూ తమ నిశ్చితార్థాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఇపుడు ఈ గ్రాండ్ వెడ్డింగ్తో తమ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taylor Swift (@taylorswift)