మరిగే నీళ్లలో ఎండిపోయిన ఆకు ఒక్కటి వేస్తే చాలు ఘుమఘుమలే. బిర్యానీ ఆకును సూప్ లు, సాస్లు వంటి వాటిల్లో వాడతారు. ముఖ్యంగా పులావ్, బిర్యానీలు చేయాలంటే ఇది కచ్చితంగా ఉండి తీరాల్సిందే. 'బే లారెల్' అనే మొక్క ఆకులే ఈ బిర్యానీ ఆకులు. వీటినే 'బే లీవ్స్' అని కూడా అంటారు. మామూలుగా అయితే దీన్ని అందం కోసం కూడా పెంచుకుంటారు. ఎండబెట్టిన ఆకులను వంటల్లో వాడే విషయం తెలిసిందే.
బిర్యానీ ఆకుల్లో టర్కిష్, కాలిఫోర్నియా అనే రెండు రకాలున్నాయి. టర్కిష్ ఆకులనే ఎక్కువగా వాడతారు. కాలిఫోర్నియా ఆకులను ఎండబెట్టకుండానే వంటల్లో వేసుకుంటారు. ఇవి ఎక్కువగా మెడిటేరియన్ ప్రాంతాల్లో పెరుగుతాయి. అక్కడే కాదు. మన దేశమంతటా బే లీవ్స్ రకాలు పండుతున్నాయి. వాటిలో వెస్ట్ ఇండియన్ బేలీఫ్, ఇండోనేషియా బే లీవ్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిలో విషపూరితమైన రకాలు కూడా ఉన్నాయి. చెర్రీ లారెల్, మౌంటెన్ లారెల్ అనేవి ఎక్కువ ప్రమాదకరం. అందుకే వాటిని
అమ్మరు.
ఇండియన్ బే లీవ్స్
ఇండియన్ బే లీవ్స్ ను 'తేజ్ పట్టా' అని పిలుస్తారు. వాటినే పుంజెంట్ లీఫ్ లేదా 'మలబార్ లీఫ్' అని కూడా అంటారు. ఇవి అలివ్ గ్రీన్ కలర్ లో పెద్దగా ఉంటాయి. వీటిని లాటిన్ లో 'సిన్నమొనమ్ తమల' అంటారు.
హిమాలయ పర్వత శ్రేణి దక్షిణ ప్రాంతాల్లో, నేపాల్, భూటాన్, బర్మా, నార్త్ ఈస్ట్రన్ ఇండియా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క ఉత్తర భారతంలో మొఘలాయ్ వంటకాల్లో వాడతారు. వాటిలో బిర్యానీదే ఫస్ట్ ప్లేస్.
గౌరవ చిహ్నంగా..
ఈ ఆకులను పూర్వం గ్రీకు, రోమన్ చక్రవర్తులు, హీరోలు, కవులు, స్కాలర్లను గౌరవించడానికి, వారి విజయాలకు గుర్తుగా ఇచ్చేవారు. అలా ధరించిన దాన్ని 'బెకా లారెట్' అని పిలుస్తారు. అంటే 'బెర్రీస్ ఆఫ్ లారెల్' అని అర్థం. ఏదైనా డిగ్రీ సాధించిన వారిని ప్రభుత్వం బేలీఫ్ తో గౌరవిస్తుందన్నమాట.
*ఫ్రెష్ బే లీవ్స్ వంటల్లో వాడుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పైగా వీటి ధర ఎండిన ఆకుల కంటే ఎక్కువ. ఫ్రెష్ బేలీవ్స్ ని విదేశాల్లో ఎక్కువగా వాడతారు.
*ఫ్రెష్ బేలీవ్స్ ని జిప్ లాక్ బ్యాగ్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే, రెండు నుంచి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. అదే డ్రై లీవ్స్ అయితే ఒక బాక్స్లో పెట్టి కూల్ లేదా డ్రై, చీకటిగా ఉండే ప్రదేశాల్లో పెడితే దాదాపు రెండు సంవత్సరాల వరకూ పాడవవు ఇంకా సువాసన కూడా ఏమాత్రం తగ్గదు.
*డ్రై బే లీవ్స్ ని పొడి చేసి సూప్లో వాడతారు. వీటిని చర్మ, శ్వాస సంబంధిత సమస్యలకు అరోమా థెరపీ, హెర్బల్ ట్రీట్మెంట్లలో వాడతారు.
*బేలీఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్, డయాబెటిసు మేనేజ్ చేయడంలోనూ ఉపయోగపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మంటను తగ్గిస్తుంది. శ్వాస, జీర్ణ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది.
*వంటల్లో వీటిని వాడడం వల్ల పొత్తికడుపునొప్పి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్. ఫ్లాటింగ్, బోటింగ్, మలబద్ధకం, డయేరియా వంటి వాటి నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ విషయం మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందట.
*ఈ ఆకుల నుంచి తీసే నూనెను 'సినెయోల్' అంటారు. ఆ నూనెను ఛాతిపైన రాసుకుని, రాత్రంతా ఉండాలి. దాన్నుంచి వచ్చే వాసనను పీల్చడం ద్వారా బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తుంది. దాంతో హాయిగా శ్వాస పీల్చుకోవచ్చు.
*శరీరంలో ఎక్కడ మంట పుట్టినా ఈ ఆకులతో తగ్గించుకోవచ్చు. వీటిలో పార్థనోలిడే అనే ప్రత్యేకమైన ఫైటో న్యూట్రియెంట్ ఉంటుంది. మంట ఉన్నచోట ఈ నూనెను రాస్తే వెంటనే రిలీఫ్ ఉంటుంది. ఆర్థరైటిస్ ఉన్నవాళ్లకూ మేలు చేస్తుంది.
ALSO READ : మీ పిల్లలు ఆటల్లో పడి తినట్లేదా ? ఈ చిన్న చిట్కాలు తెలిస్తే కడుపునిండా తింటారు !
*ఈ ఆకుల్లో కెఫియిక్ యాసిడ్, రుటిన్ అనే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. కెఫియిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపిస్తుంది. రుటీన్ అనేది కాపీలరీ వాల్స్ ను బలంగా ఉంచుతుంది.
*లినలూల్ అనే ఆర్గానిక్ సమ్మేళనం వల్ల బాడీలోని స్ట్రెస్ హార్మోన్ లెవల్స్ తగ్గిపోతాయి.
*ఇన్సులిన్ రిసెప్టార్ ఫంక్షను ఇంప్రూవ్ చేస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు దీన్ని రోజుకు రెండు సార్లు వంటల్లో వాడుకోవచ్చు.
*ఈ ఆకులతో చేసిన టీని పదిరోజుల పాటు రోజూ తీసుకుంటే బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి.
*బేలీఫ్ సెంట్రల్ నెర్వస్ సిస్టం పనితీరును నిదానింపజేస్తుంది. సర్జరీలో ఇది అనస్తీషియాగా పనిచేస్తుంది. అందుకనే వీటితో చేసిన మెడిసిన్ ని సర్జరీకి రెండు వారాల ముందు తీసుకోకూడదని చెబుతారు సర్జన్స్.
*కాన్సర్ కణాలను చంపేస్తుంది. బ్రెస్ట్ కాన్సర్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
*డాండ్రఫ్ పోగొడుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. నీళ్లలో ఈ ఆకులు వేసి, ఆ నీళ్లతో తల స్నానం చేస్తే ఈ రెండు సమస్యలు తగ్గుతాయి.
